ఒలింపిక్స్‌లోకి క్రికెట్.. !

ఒలింపిక్స్‌లోకి క్రికెట్.. !

దుబాయ్: ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చాలని ఎన్నాళ్ల నుంచో డిమాండ్లు వస్తున్నాయి. విశ్వక్రీడల్లో క్రికెట్ ఉంటే బాగుంటుందని, మన జట్టు ఆడితే మెడల్ ఖాయమని భారత క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయం. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై అటు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ గానీ ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీ కానీ ఎలాంటి కామెంట్లు చేయలేదు కానీ ఇప్పుడు ఈ దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. 2028లో జరిగే లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చాల్సిందిగా ఒలింపిక్స్ కమిటీకి ఐసీసీ ప్రతిపాదనలు పంపనుంది. బిడ్ తయారీకి ఓ ప్రత్యేక ప్యానెల్ ను ఐసీసీ నియమించింది.

కాగా, ఇప్పటికే వచ్చే ఏడాది బర్మింగ్‌హామ్‌లో జరిగే కామన్‌వెల్త్ గేమ్స్‌లో తొలిసారిగా క్రికెట్‌ను కూడా భాగం చేయనున్నారు. ఈ నేపథ్యంలో 2028 ఒలింపిక్స్‌ను టార్గెట్‌గా పెట్టుకుని, విశ్వ క్రీడల్లోకి కూడా దీనిని తీసుకుని వచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు ఐసీసీ తెలిపింది.