
న్యూజిలాండ్ పర్యటనలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియాకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సెల్(ICC) భారీ షాక్ ఇచ్చింది. భారత క్రికెటర్ల మ్యాచ్ ఫీజులో కోత విధించింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో T-20 లో నిర్ణీత సమయంలో ఓవర్లు ముగించని కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇండియా నిర్దేశిత సమయంలో 20 ఓవర్లు వేయాల్సి ఉండగా… 2 ఓవర్లు ఆలస్యంగా వేసింది. దీంతో ICC మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ ఒక్కో ఓవర్‌కు 20 శాతం చొప్పున 2 ఓవర్లకు మొత్తం 40 శాతం జరిమానా విధించారు. ఫీల్డ్ అంపైర్లు క్రిస్ బ్రౌన్, షాన్ హైగ్, మూడో అంపైర్ మెహోత్రా కోహ్లీ సేనపై ఆరోపణలు నమోదు చేశారు. అయితే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పొరపాటును అంగీకరించడంతో ఎలాంటి విచారణ జరగలేదు.