సూర్యకు జరిమానా, రవూఫ్‌‌పై 2 మ్యాచ్‌‌ల బ్యాన్‌‌

సూర్యకు జరిమానా, రవూఫ్‌‌పై 2 మ్యాచ్‌‌ల బ్యాన్‌‌

దుబాయ్: ఆసియా కప్‌‌  సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను  ఇండియా టీ20  కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పాకిస్తాన్ పేసర్ హారిస్ రవూఫ్‌‌పై ఐసీసీ చర్యలు తీసుకుంది. రెండు వేర్వేరు మ్యాచ్‌‌ల్లో  రవూఫ్ ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌‌ను ఉల్లంఘించినందుకు రెండుసార్లు 30 శాతం చొప్పున జరిమానా విధించారు. 

దీంతో మొత్తం 60 శాతం  జరిమానాతో పాటు అతనికి నాలుగు డీమెరిట్ పాయింట్లు లభించాయి. ఫలితంగా  సౌతాఫ్రికాతో జరుగతున్న వన్డే సిరీస్‌‌లో  రెండు మ్యాచ్‌‌ల్లో ఆడకుండా రవూఫ్‌‌పై బ్యాన్ పడింది. మరోవైపు సూర్యకుమార్ మ్యాచ్ ఫీజులో  ఐసీసీ 30 శాతంకోత విధించింది.

 పుల్వామా ఉగ్రదాడి బాధితులకు సంఘీభావం తెలుపుతూ, మన దేశ సాయుధ దళాలకు మద్దతుగా సూర్య చేసిన వ్యాఖ్యలు ఆటకు అగౌరవం కలిగించేలా ఉన్నాయనే ఆరోపణపై ఈ చర్య తీసుకుంది.  ఈ ఘటనల్లో బుమ్రాకు ఒక డీమెరిట్ పాయింట్ లభించగా, అర్ష్‌‌దీప్ సింగ్, సాహిబ్జదా ఫర్హాన్‌‌లపై ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.