ఐసీసీ.. వన్డే ప్రపంచకప్-2023కు సంబంధించిన లోగోను విడుదల చేసింది. ఈ ప్రపంచకప్ కోసం ఈసారి భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే వరల్డ్ కప్ జరగనుంది. మన దేశంలో చివరిసారిగా 2011 వన్డే వరల్డ్ జరగగా.. అందులో టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. అయితే, టీమిండియా వరల్డ్ కప్ గెలిచి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఐసీసీ కొత్త వరల్డ్ కప్ లోగోను విడుదల చేసింది.
బ్లూ, పింక్ కలర్ డిజైన్స్ మధ్య వరల్డ్ కప్ ఉంచి కొత్త లోగోను ఆకర్షనీరంగా తయారుచేశారు. ‘2023 వన్డే ప్రపంచకప్‌కు ఇంకా ఆరు నెలల టైం మాత్రమే ఉంది. సొంతగడ్డపై వరల్డ్ కప్ ఆడాలన్నది ప్రతీ జట్టు, ఆటగాడి కల. మేమంతా ఈ టోర్నీ ఎప్పుడు మొదలవుతుందా అనే ఉత్సాహంతో ఉన్నా. టీమిండియా పూర్తి సామర్థ్యంతో ఆడితే ట్రోఫీని గెలిచే అవకాశం ఉంది’ అని లోగో రిలీజ్ అయిన సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్‌శర్మ అన్నాడు.
2011 వరల్డ్ కప్ ఫైనల్లో.. ధోని సారథ్యంలోని భారత్ జట్టు శ్రీలంకను ఓడించి చరిత్రాత్మక విజయం సాధించింది. ఆ మ్యాచ్ లో ధోనీ సిక్స్ కొట్టి గెలిపించిన క్షణాలు ఇంకా క్రికెట్ ప్రేమికుల కళ్లల్లో ఉన్నాయి. మరోసారి అలాంటి అనుభూతిని పొందడానికి భారత అభిమానులు సిద్ధంగా ఉన్నారు.
