ICC World Cup 2023 : వన్డే వరల్డ్ కప్ పాట విడుదల

ICC World Cup 2023 :  వన్డే వరల్డ్ కప్ పాట విడుదల

2023 అక్టోబర్ 5నుంచి మెుదలుకానున్న వన్డే ప్రపంచ కప్ కోసం  ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)  స్పెషల్  సాంగ్ ను రూపొందించింది.  దిల్‌ జషన్‌ బోలే..  అంటూ సాగే ఈ పాటలో రణ్‌వీర్‌ సింగ్‌తోపాటు యుజ్వేంద్ర చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ తదితరులు ఆడిపాడారు. ప్రముఖ బాలీవుడ్ కళాకారుడు ప్రీతమ్ సంగీతం అందించగా సావేరి వర్మ శ్లోక్ లాల్ లిరిక్స్ రాశారు. నకాష్ అజీజ్, శ్రీరామ చంద్ర, అమిత్ మిశ్రా, జోనితా గాంధీ, ఆకాసా, చరణ్ చేత రాప్‌తో సహా పలువురు గాయకులు పాడారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.  

2023 అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ తో వరల్డ్ కప్ మెుదలుకానుంది.  టీమిండియా తన తొలి మ్యాచ్ ను ఆస్ట్రేలియాతో అక్టోబరు 08న ఆడనుంది. అక్టోబర్ 14న పాకిస్థాన్ తో తలపడనుంది.  నవంబరు 19న టోర్నీ ముగియనుంది. ఇప్పటికే వన్డే వరల్డ్ కప్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది.  

ప్రపంచ కప్ కు భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్. షమీ, మొహమ్మద్. సిరాజ్, కుల్దీప్ యాదవ్