సౌతాఫ్రికాపై పాక్ గ్రాండ్ విక్టరీ

సౌతాఫ్రికాపై పాక్ గ్రాండ్ విక్టరీ

సెమీస్ రేసులో నిలవాలంటే..తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో  పాక్ అదరగొట్టింది. మంచి ఫాంలో కొనసాగుతున్న సఫారీ జట్టును పాక్ 33 పరుగుల తేడాతో (డక్ వర్త్ లూయిస్) ఓడించింది. ముందు బ్యాటింగ్ చేసిన పాక్  20 ఓవర్లలో పాక్ 185 పరుగులు చేసింది. అనంతరం 186 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగినన దక్షిణాఫ్రికా 9 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 69 పరుగులు మాత్రమే చేసింది. ఈ సమయంలో వరుణుడి అంతరాయం కలిగింది. దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని 14 ఓవర్లకు 142 పరుగులగా ఫిక్స్ చేశారు.చివరకు సఫారీ జట్టు 14 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 108 పరుగులు మాత్రమే చేయగలిగింది.

పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రాబట్టేందుకు స్టబ్స్, క్లాసెస్ ప్రయత్నించారు. కానీ..వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. వెనువెంటనే పాక్ బ్యాట్స్ మెన్స్ తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. ఈ విజయంతో పాక్ 4 పాయింట్లు సాధించి పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. చివరి మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టుపై గెలిచినా.. భారత్ - దక్షిణాఫ్రికా జట్ల ఫలితాలపై పాక్ సెమీస్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.