
ఇటీవల ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అదరగొట్టిన ఆటగాళ్లు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లోనూ అదరగొట్టారు. అహ్మదాబాద్ టెస్టులో సెంచరీ కొట్టిన కోహ్లీ ఏడు స్థానాలు ఎగబాకి 13వ స్థానానికి చేరుకున్నాడు. రిషబ్ పంత్ 9, రోహిత్ శర్మ 10స్థానాలలో చోటు సంపాదించారు. శ్రీలంకతో ఆసీస్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ (915) అగ్రస్థానంలో నిలిచాడు. టాప్10లో మొత్తం ముగ్గరు భారత ఆటగాళ్లు చోటు సంపాదించారు. అటు బౌలర్లలో అశ్విన్ నెంబర్ వన్ స్థానాన్ని తిరిగి పొందాడు. ఇంతకుముందు జేమ్స్ అండర్సన్ తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచిన అశ్విన్.. పది పాయింట్లను అదనంగా తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో 869 పాయింట్లతో అశ్విన్ టాప్ లో కొనసాగుతున్నాడు. రవీంద్ర జడేజా 753 పాయింట్లతో 9వ స్థానంలో ఉన్నారు.
అటు ఆల్‌రౌండర్ల జాబితాలో తొలి రెండు స్థానాలు టీమిండియాకు చెందిన ఆటగాళ్లే ఉన్నారు. ఆసీస్‌తో టెస్టు సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌ను ఉమ్మడిగా గెలుచుకున్న టీమ్ఇండియా ఆటగాడు రవీంద్ర జడేజా (431), రవిచంద్రన్ అశ్విన్ (359) వరుసగా మొదటి, రెండో ర్యాంక్‌లో నిలిచారు. ఇక జట్టుపరంగా ఆస్ట్రేలియా 122 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. భారత్ 119 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆ తరువాత ఇంగ్లాండ్ (106), దక్షిణాఫ్రికా (104), న్యూజిలాండ్ (100), పాకిస్థాన్ (88), శ్రీలంక (88), వెస్టిండీస్ (76), బంగ్లాదేశ్ (46), అఫ్గానిస్థాన్ (40) టాప్ -10లో నిలిచాయి.