Canada Cricket Board: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) అహ్మదాబాద్‌లో నిర్వహించిన బోర్డు సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. నిబంధనల ఉల్లంఘన కారణంగా క్రికెట్ కెనడా (Cricket Canada) బోర్డు సభ్యత్వాన్ని ఐసీసీ తక్షణమే రద్దు చేస్తూ (Suspended) సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే, అక్కడి ఆటగాళ్ల భవిష్యత్తు దెబ్బతినకుండా ఉండేందుకు.. కెనడా జాతీయ జట్లు ఐసీసీ ఈవెంట్లలో పాల్గొనేందుకు, నిధులు పొందేందుకు ఐసీసీ ఒక ప్రత్యేక నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసింది. బోర్డుని మళ్లీ పునరుద్ధరించబడటానికి కొన్ని కఠినమైన నిబంధనలను విధించింది.
* ఐసీసీ చైర్మన్ జై షా మాట్లాడుతూ.. అహ్మదాబాద్ లో జరిగిన బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు గ్లోబల్ క్రికెట్ వృద్ధికి, పారదర్శకతకు అద్దం పడుతున్నాయి. మహిళల క్రికెట్, ఫ్రాంచైజీ లీగ్స్ మేనేజ్మెంట్, నిబంధనల మార్పులు క్రికెట్‌ను మరింత రసవత్తరంగా మారుస్తాయని పేర్కొన్నారు.
* బంగ్లాదేశ్, శ్రీలంక బోర్డుల పరిశీలన: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఎన్నికల ప్రక్రియ, శ్రీలంక క్రికెట్ పరిణామాలను పరిశీలించేందుకు ఐసీసీ ప్రతినిధుల బృందం (దేవాజిత్ సైకియాతో కూడిన టీమ్) అక్కడ పర్యటించనుంది.
ALSO READ : సరిహద్దులు దాటిన కోహ్లీ క్రేజ్..
* ఫ్రాంచైజీ లీగ్స్ పై కన్ను: ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోతున్న టీ20/టీ10 ఫ్రాంచైజీ లీగ్స్ వల్ల అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్‌కు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు.. వీటిని నియంత్రించి, బ్యాలెన్స్ చేయడానికి ఐసీసీ ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.
🚨 Following the ICC Board Meeting in Ahmedabad, Cricket Canada has been suspended from its ICC membership with immediate effect due to "serious breaches of its membership obligations"
— Cricbuzz (@cricbuzz) June 1, 2026
Canadian national representative teams will be eligible, however, to participate in ICC events… pic.twitter.com/BumsfzkIut
