దుబాయ్: ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌లోనే కొనసాగుతున్నాడు. బుధవారం విడుదల చేసిన తాజా జాబితాలో బుమ్రా 879 రేటింగ్ పాయింట్లతో టాప్ ప్లేస్‌ను పదిలం చేసుకున్నాడు.
మహ్మద్ సిరాజ్ (707).. 12వ ర్యాంక్‌లో ఉండగా, రవీంద్ర జడేజా (698), కుల్దీప్ యాదవ్ (694) చెరో స్థానం దిగజారి వరుసగా 14, 15వ ర్యాంక్‌ల్లో నిలిచారు. మిచెల్ స్టార్క్ (838), మ్యాట్ హెన్రీ (836), కమిన్స్ (832), నోమన్ అలీ (825) టాప్–4లో ఉన్నారు.
బ్యాటింగ్ విభాగంలో యశస్వి జైస్వాల్ (750), శుభ్‌మన్ గిల్ (730) వరుసగా 8, 9వ ర్యాంక్‌ల్లో ఉన్నారు. రిషబ్ పంత్ (704)... 14వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. గతేడాది నవంబర్‌లో స్వదేశంలో సౌతాఫ్రికాతో ఆడిన తర్వాత ఇండియా ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్క ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) మ్యాచ్ కూడా ఆడలేదు. సుదీర్ఘ విరామం ఉన్నప్పటికీ టీమిండియా ప్లేయర్లు తమ ర్యాంకులను నిలబెట్టుకోవడం విశేషం.
