
దుబాయ్: ఇండియా టీనేజ్ సెన్సేషన్ షెఫాలీ వర్మ ఐసీసీ విమెన్స్ టీ20 బ్యాటర్స్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్ వన్ ప్లేస్ సొంతం చేసుకుంది. మంగళవారం రిలీజైన లేటెస్ట్ లిస్ట్‌లో షెఫాలీ రెండు నుంచి ఒకటో ప్లేస్‌కు చేరుకుంది. కానీ, ఆమె ఓపెనింగ్ పార్ట్‌నర్ స్మృతి మంధాన మాత్రం ఒక ప్లేస్ కోల్పోయి నాలుగో ర్యాంక్‌కు పడిపోయింది. బౌలర్లలో దీప్తి శర్మ ఐదు నుంచి నాలుగో ప్లేస్‌కు చేరుకుంది.