Women's ODI World Cup 2025: వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో శ్రీలంకతో ఇండియా ఢీ.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?

Women's ODI World Cup 2025: వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో శ్రీలంకతో ఇండియా ఢీ.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?

ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వన్డే వరల్డ్ కప్ 2025కు రంగం సిద్ధమైంది. ఇండియా, శ్రీలంక సంయక్తంగా ఆతిధ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ మంగళవారం (సెప్టెంబర్ 30) నుంచి ప్రారంభం కానుంది. వన్డే వరల్డ్ కప్ చరిత్రలో ఒక్కసారి కూడా టైటిల్ అందుకోలేకపోయిన టీమిండియా ఈ సారి సొంతగడ్డపై ఎలాగైనా ఆ కలను నెరవేర్చుకోవాలనే పట్టుదలతో కనిపిస్తుంది. జట్టు అన్ని విభాగాల్లో బలంగా ఉండడంతో ఈ సారి మన జట్టుకు వరల్డ్ కప్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 47 ఏండ్లుగా అందని ద్రాక్షలా ఊరిస్తున్న వరల్డ్ కప్‌‌‌‌ టైటిల్‌‎ను ఈ సారి ఎలాగైనా ముద్దాడాలని భారత మహిళల జట్టు కసిగా కనిపిస్తుంది.   

మంగళవారం (సెప్టెంబర్ 30) హర్మన్‌‌‌‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని భారత జట్టు శ్రీలంకతో తలపడనుంది. గౌహతి వేదికగా బర్సపారా క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతుంది. హోమ్‌‌‌‌గ్రౌండ్‌‎లో ఆడటం ఇండియాకు అతి పెద్ద బలం. ఇటీవలే ఇంగ్లండ్‌‎పై వన్డే, టీ20 సిరీస్‌‌‌‌లను గెలవడం, బలమైన ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌‎లో గట్టి పోటీ ఇవ్వడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. మరోవైపు శ్రీలంక తొలి మ్యాచ్ లో ఇండియాకు ఎలాగైనా గట్టి షాక్ ఇవ్వాలని చూస్తోంది.  

పటిష్టంగా టీమిండియా:
 
ఈ ఏడాది నాలుగు వన్డే సెంచరీలు కొట్టిన వైస్ కెప్టెన్ స్మృతి మంధాన తన కెరీర్‌‌‌‌ బెస్ట్‌‌‌‌ఫామ్‌‌‌‌లో ఉంది. ఆమెకు యంగ్ ఓపెనర్ ప్రతీక రావల్ గొప్ప సపోర్ట్ ఇస్తోంది. కెప్టెన్ హర్మన్‌‌‌‌ప్రీత్ కౌర్ పెద్ద టోర్నీల్లో చెలరేగి ఆడుతుంది. జెమీమా రోడ్రిగ్స్, మిడిలార్డర్‌‎లో రిచా ఘోష్, హర్లీన్ డియోల్, ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌ దీప్తి శర్మతో బ్యాటింగ్ డెప్త్ బాగుంది. గాయం నుంచి కోలుకుని రీఎంట్రీ ఇచ్చిన రేణుకా సింగ్ పేస్‌‌‌‌ దాడికి నేతృత్వం వహించనుండగా.. 22 ఏండ్ల యంగ్ సెన్సేషన్ క్రాంతి గౌడ్ తన పేస్, యార్కర్లతో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టగలదు. స్పిన్‌‎కు అనుకూలించే లోకల్ పిచ్‌‎లపై దీప్తి శర్మ, రాధా యాదవ్, స్నేహ్ రాణా, శ్రీ చరణిపై సహజంగానే భారీ అంచనాలున్నాయి.
  
లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే: 

మహిళల వరల్డ్ కప్ మ్యాచ్ లన్ని జియో హాట్ స్టార్, వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. లైవ్ టెలికాస్టింగ్ కు వస్తే టెలివిజన్‌లో   స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో లైవ్ చూడొచ్చు. మ్యాచ్ మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రత్యక్ష ప్రసారమవుతుంది. 2:30 గంటలకు టాస్ వేస్తారు.    

మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 ఇండియా ప్లేయింగ్ 11(అంచనా) 

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన ( వైస్ కెప్టెన్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, ఉమా చెత్రీ, రేణుకా సింగ్ ఠాకూర్, దీప్తి శర్మ, స్నేహ రాణా, శ్రీ చరణి, రాధ యద్ కావ్, అరుణ్‌జోత్ రెడ్డి