
దుబాయ్: ఇండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన.. ఐసీసీ విమెన్స్ వన్డే ర్యాంకింగ్స్‌లో రెండో ప్లేస్‌కు పడిపోయింది. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో మంధాన (728) ఒక్క ర్యాంక్ దిగజారింది. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో 115 రన్సే చేయడం ఆమెకు మైనస్‌గా మారింది. ఇంగ్లండ్ కెప్టెన్ సివర్ బ్రంట్ (731) టాప్ ప్లేస్‌కు చేరుకుంది.
ఇండియాతో జరిగిన సిరీస్‌లో 106 రన్స్ చేయడం ఆమె ర్యాంక్ మెరుగుపడటానికి దోహదం చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (645) పది స్థానాలు ఎగబాకి 11వ ర్యాంక్‌లో నిలిచింది. జెమీమా రొడ్రిగ్స్ (622) రెండు ప్లేస్‌లు మెరుగుపడి 13వ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. బౌలింగ్‌లో దీప్తి శర్మ (650) నాలుగో ర్యాంక్‌లోనే ఉంది. సోఫీ ఎకెల్‌స్టోన్ (795), ఆష్లే గాడ్నెర్ (724), మేఘన్ షుట్ (696) వరుసగా టాప్–3లో కొనసాగుతున్నారు.