రూ.100 కోట్ల ఆదాయం ఐస్​బర్గ్​ టార్గెట్​

రూ.100 కోట్ల ఆదాయం ఐస్​బర్గ్​ టార్గెట్​

హైదరాబాద్, వెలుగు :  2026 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి తమ టర్నోవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రూ. 100 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఐస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బర్గ్ ఆర్గానిక్ ఐస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రీమ్స్ మంగళవారం తెలిపింది. హైదరాబాద్​కు చెందిన ఈ కంపెనీకి ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని నెల్లూరులో తయారీ కేంద్రం ఉంది. ఐస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బర్గ్ గత ఏడాది రూ. 14 కోట్ల టర్నోవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సాధించింది. 

ఈ సందర్భంగా 'ఆర్గానిక్ క్రీమరీ' పేరుతో ప్రీమియం ఐస్ క్రీమ్ బ్రాండ్ ను లాంచ్ చేసింది. ఈ ఐస్ క్రీమ్ తయారీలో అన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్ లనే వాడామని పేర్కొంది. అంతేకాకుండా తన 73 వ ఔట్ లెట్ ను హైదరాబాద్ లోని కావూరి హిల్స్ దగ్గర ఏర్పాటు చేశామని, దసరాకి ఓపెన్ చేస్తామని తెలిపింది.