
హైదరాబాద్, వెలుగు : ఈ నెల 14 నుంచి జరగాల్సిన టీఎస్ఐసెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్‌ను సెప్టెంబర్ 6 నుంచి నిర్వహించనున్నామని టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ వాకాటి కరుణ తెలిపారు. రివైజ్డ్ షెడ్యూల్‌ను ఆమె శనివారం విడుదల చేశారు. ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌లో సెప్టెంబర్ 6 నుంచి 11 వరకూ రిజిస్ర్టేషన్లతో పాటు ఫీజు చెల్లింపు ప్రక్రియ ఉంటుందని, 8 నుంచి 12వ తేదీ వరకూ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుందని ఆమె తెలిపారు. వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన అభ్యర్థులు 13వ తేదీ వరకూ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని, వారికి సెప్టెంబర్ 17న సీట్లు కేటాయిస్తారని ఆమె వెల్లడించారు. సీట్లు పొందిన అభ్యర్థులు 20 లోపే ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించారు. ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ సెప్టెంబర్ 22 నుంచి 30 వరకూ కొనసాగుతుందని చెప్పారు.