
ఎంబీఏలో 20,481, ఎంసీఏలో 2,370 సీట్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ సీట్ల వివరాలను టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రకటించింది. 231 ఎంబీఏ కాలేజీల్లో 20,481 సీట్లు ఉండగా, 40 ఎంసీఏ కాలేజీల్లో 2,370 సీట్లు ఉన్నాయని టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం నుంచి ఐసెట్ అడ్మిషన్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు. 15 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉంటుందని, ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ ఈ నెల 18న నిర్వహిస్తామని వివరించారు.