సెప్టెంబర్ 15 నుంచి ఐసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్

సెప్టెంబర్ 15 నుంచి ఐసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్

హైదరాబాద్, వెలుగు: టీజీ ఐసెట్ ఫైనల్ ఫైజ్ అడ్మిషన్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 15 నుంచి  ప్రారంభం కానున్నదని టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన తెలిపారు. ఈ మేరకు ఆదివారం రివైజ్డ్ షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఈ నెల15న ఆన్​లైన్​ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఉంటుందని, 16న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని ప్రకటించారు.16,17 తేదీల్లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగనుండగా, 20వ తేదీ వరకు సీట్ల అలాట్మెంట్ ఉంటుందని వెల్లడించారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 23లోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు. కాగా, 23న మిగిలిపోయిన ఎంబీఏ, ఎంసీఏ సీట్లకు ఐసెట్ స్పాట్ కౌన్సెలింగ్ గైడ్ లైన్స్ ఇవ్వనున్నారు.