
- వార్షికంగా 25 శాతం పెరుగుదల
ముంబై: ఐసీఐసీఐ బ్యాంక్‌కు డిసెంబర్ క్వార్టర్లో రూ.11,052.60 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) వచ్చింది. 2023 డిసెంబరు క్వార్టర్లో వచ్చిన లాభం రూ.8,792.42 కోట్ల కంటే ఇది 25.7 శాతం ఎక్కువ. మనదేశంలోనే రెండవ అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకుకు స్టాండ్‌లోన్ లెక్కన నికర లాభం 23.6 శాతం పెరిగి రూ.10,272 కోట్లకు చేరుకుంది. బ్యాంకు నికర వడ్డీ ఆదాయం 13.4 శాతం పెరిగి రూ. 18,678 కోట్లకు చేరుకుంది.
నికర వడ్డీ మార్జిన్ 4.43 శాతానికి తగ్గింది. దేశీయ అడ్వాన్సుల వృద్ధి 18.8 శాతానికి చేరుకుంది. తాజా క్వార్టర్లో బ్యాంక్ ఇతర ఆదాయం 19.8 శాతం పెరిగి రూ.5,975 కోట్లకు చేరుకుంది. కేటాయింపులు గత ఏడాది కాలంలో రూ. 2,257.44 కోట్ల నుంచి రూ. 1,049.37 కోట్లకు తగ్గాయి. దీనివల్ల లాభం పెరిగింది.