సెకండ్‌‌‌‌ డోస్‌‌‌‌ తర్వాతే కొవాగ్జిన్ తో ఇమ్యూనిటీ ఎక్కువ

సెకండ్‌‌‌‌ డోస్‌‌‌‌  తర్వాతే  కొవాగ్జిన్ తో ఇమ్యూనిటీ ఎక్కువ

న్యూఢిల్లీ: కొవాగ్జిన్ కరోనా టీకా ఫస్ట్ డోస్ వేసుకున్న తర్వాత వైరస్ కు వ్యతిరేకంగా ఇమ్యూనిటీ స్వల్పంగానే ఉంటుందని గురువారం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) చీఫ్​డాక్టర్ బలరాం భార్గవ వెల్లడించారు. సెకండ్ డోస్ తీసుకున్న తర్వాతే కొవాగ్జిన్ తో యాంటీబాడీలు బాగా ఉత్పత్తి అయి ఇమ్యూనిటీ పెరుగుతుందని ఆయన తెలిపారు. అందుకే కొవాగ్జిన్ సెకండ్ డోస్ కు 4 నుంచి 6 వారాల గ్యాప్ ను మాత్రమే నిర్ణయించారని తెలిపారు. ఫస్ట్ డోస్ తర్వాత 4 నుంచి 6 వారాల మధ్య సెకండ్ డోస్ తీసుకుంటేనే వైరస్​కు వ్యతిరేకంగా యాంటీబాడీలు బాగా ఉత్పత్తి అవుతాయన్నారు. అయితే కొవిషీల్డ్ టీకాతో ఫస్ట్ డోస్ తర్వాతే వైరస్​కు వ్యతిరేకంగా ఇమ్యూనిటీ బాగా పెరుగుతుందన్నారు. ఆ తర్వాత 3 నెలలకు సెకండ్ డోస్ తీసుకుంటే టీకా మరింత బాగా పని చేస్తుందన్నారు. అందుకే కొవిషీల్డ్ సెకండ్ డోస్ కు గడువును 12 నుంచి 16 వారాలకు పెంచినట్లు ఆయన వివరించారు.