డైరెక్ట్‌‌ కాంటాక్టులకు టెస్టులు తప్పనిసరి

డైరెక్ట్‌‌ కాంటాక్టులకు టెస్టులు తప్పనిసరి

హైదరాబాద్‌‌, వెలుగు: కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన వ్యక్తితో కాంటాక్ట్ అయిన డైరెక్ట్‌‌, హైరిస్క్ (మెడికల్ స్టాఫ్) కాంటాక్టు వ్యక్తులందరికీ లక్షణాలు లేకున్నా టెస్టులు చేయాలని ఇండియన్  కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌‌ (ఐసీఎంఆర్‌‌‌‌) వెల్లడించింది. పాజిటివ్ వ్యక్తితో కాంటాక్టైన రోజు నుంచి 5వ రోజు, ఒకవేళ నెగెటివ్ వస్తే తిరిగి 10వ రోజు మరోసారి టెస్ట్ చేయాలని సూచించింది. సోమవారం ఐసీఎంఆర్ సవరించిన కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసింది. సొంత రాష్ట్రాలకు తిరిగొస్తున్న వలస కార్మికులకు దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలుంటే 7 రోజుల్లోపు టెస్టులు చేయించాలని స్పష్టం చేసింది. ఏదైనా జబ్బుతో ప్రభుత్వ, ప్రైవేట్ ​హాస్పిటళ్లలో చేరిన తర్వాత దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలు మొదలైతే, వాళ్లకు కరోనా టెస్టులు చేయాలని పేర్కొంది. ఇతర అనారోగ్య సమస్యతో అత్యవసర ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకుంటున్న వాళ్లకు కరోనా లక్షణాలు ఉంటే శాంపిల్స్‌‌ తీసుకుని టెస్టులకు పంపాలేతప్ప, ట్రీట్‌‌మెంట్‌‌ మాత్రం ఆపొద్దని సూచించింది. శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వారికి టెస్టులు చేయాలంది. హెల్త్ కేర్ వర్కర్లకు, కరోనా కంట్రోల్‌‌ కోసం కంటెయిన్​మెంట్​జోన్లలో పనిచేస్తున్న సిబ్బందికి వైరస్ లక్షణాలుంటే టెస్టులు చేయించాలని ఆదేశించింది.

దేశ వ్యాప్తంగా లక్ష దాటిన కరోనా టెస్టులు