నిర్మల్, వెలుగు: నిర్మల్‌జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీలో ఐసీటీ తరగతులను వర్సిటీ వైస్ ఛాన్సలర్ గోవర్ధన్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని, నాణ్యమైన విద్యను అందించేందుకు ఐసీటీ తరగతులు ఎంతగానో తోడ్పడతాయన్నారు.
స్మార్ట్ బోధన వనరులు, హై క్వాలిటీ ఆడియో, సమగ్ర డిజిటల్ వసతులు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ సిస్టం ద్వారా ఒకే సమయంలో 300 మంది విద్యార్థులు ప్రత్యక్షంగా లైవ్ తరగతుల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని తెలిపారు.
