
కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో కర్నాటక ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. కర్నాటక ఆర్టీసీకి చెందిన బస్సులనే ఐసీయూ యూనిట్లుగా మార్చి అవసరమైన వారికి సేవలు అందిస్తోంది. హాస్పిటల్స్‌లో ఉండే ఎక్విప్‌మెంట్‌తోనే ఒక్కో బస్సుల్లో నాలుగు ఐసీయూ బెడ్స్ ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా మెడికల్ స్టాఫ్‌ను కూడా అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం ఈ బస్సులను ఎక్కువగా బెంగళూరు సిటీతో పాటు రిమోట్ ఏరియాలో వాడుతున్నారు. ఐసీయూ ఆన్ వీల్స్‌కు అదనంగా ఆక్సిజన్ ఆన్ వీల్స్ స్కీమును కూడా కర్నాటక ఆర్టీసీ ప్రారంభించింది. ప్రతి బస్సులో ఆక్సిజన్ ఎక్విప్మెంట్తో పాటు వెంటిలేటర్, ఎమర్జెన్సీ మెడిసిన్ సిస్టంతో పాటు అన్నింటిని ఏర్పాటు చేశారు. పవర్‌కు ఇబ్బంది లేకుండా జనరేటర్ సిస్టంను వాడుతున్నారు. ఒక్కో బస్సు కోసం దాదాపు పది లక్షలు ఖర్చు పెట్టారు. ఇప్పటికే 12 ఆక్సిజన్ సప్లై బస్సులు ఆపరేషన్లు కొనసాగిస్తున్నాయి.