షాకిచ్చిన ఐడీబీఐ బ్యాంక్‌

షాకిచ్చిన ఐడీబీఐ  బ్యాంక్‌

ప్రభుత్వ నిర్ణయంతో బిల్ట్‌ యాజమాన్యం కొత్తగా రూ.200 కోట్ల బ్యాంక్‌ రుణం తీసుకొచ్చి పరిశ్రమను తెరవాలని ప్రయత్నిస్తోంది.
పలు బ్యాం క్‌ లతో సంప్రదింపులు జరుపుతోంది.జీతభత్యాల విషయంలో తగ్గింపులకు అంగీకరించాలని కార్మికులతో మాట్లాడి ఒక ఒప్పందానికి వచ్చింది. త్వరలోనే సంతకాల సేకరణ చేపట్టనున్నట్లుగా ప్రకటించింది. ఇంతలో ఐడీబీఐ బ్యాంక్‌ తమ అప్పు రూ.551 కోట్లు తీర్చనందున బిల్ట్‌ ఆస్తులు మావేనంటూ పరిశ్రమ ప్రధాన ముఖద్వారం ముందు ఫ్లెక్సీ కట్టింది.
ఉత్తర్వులను అంటించింది. తమ అప్పు తీర్చాలని కోరుతూ జూన్‌ 27, 2018న బిల్ట్‌ యాజమాన్యానికి డిమాం డ్‌ నోటీస్‌ పంపిం చామని,60 రోజుల గడువిచ్చామని అయినా ఎలాం టి స్పం దన లేకపోవడంతో ఆస్తులను స్వాధీన పరుచుకుం టున్నట్లు గా బ్యాం క్‌ పేర్కొం ది. బిల్ట్‌ పరిశ్రమకు చెందిన స్థిర, చరాస్తులు, 569 ఎకరాల భూమి కూడా తమదేనని స్పష్టం చేస్తూ ఫ్లెక్సీ కట్టింది. ఇది చూసిన కార్మిక కుటుంబాలు కన్నీ ళ్లు పెట్టుకుంటున్నాయి.