ఐడీబీఐలో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు

ఐడీబీఐలో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు

1544 పోస్టులకు నోటిఫికేషన్​

ఇండస్ట్రియల్‌‌ బ్యాంక్‌‌ ఆఫ్‌‌ ఇండియా (ఐడీబీఐ) అసిస్టెంట్‌‌ మేనేజర్​, ఎగ్జిక్యూటివ్‌‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌‌ విడుదల చేసింది. ఐడీబీఐ బ్యాంక్‌‌ మణిపాల్‌‌ (బెంగళూరు), నిట్టే (గ్రేటర్‌‌ నోయిడా) విద్యాసంస్థలతో కలిసి బ్యాంకింగ్‌‌ అండ్‌‌ ఫైనాన్స్‌‌ విభాగంలో ఏడాది (9 నెలలు క్లాస్‌‌ రూం + 3 నెలలు ఇంటర్నషిప్‌‌) పాటు పీజీ డిప్లొమా (పీజీడీబీఎఫ్‌‌)లో ట్రెయినింగ్ ఇస్తారు.  ఈ కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్నవారికి అసిస్టెంట్‌‌ మేనేజర్ ఉద్యోగం లభిస్తుంది. మొత్తం 1544 ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో జూన్​ 17వ తేదీలోపు అప్లై చేసుకోవాలి. ఎగ్జిక్యూటివ్‌‌ పోస్టులు 1044, అసిస్టెంట్‌‌ మేనేజర్​ పోస్టులు 500 ఉన్నాయి. 

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌‌ ఉత్తీర్ణత. కంప్యూటర్‌‌ ఆపరేషన్స్‌‌/ లాంగ్వేజ్‌‌లో డిప్లొమా/ డిగ్రీ సర్టిఫికెట్‌‌ ఉండాలి.  ఎగ్జిక్యూటివ్‌‌ పోస్టులకు 20 నుంచి 25 ఏళ్లు, అసిస్టెంట్‌‌ మేనేజర్‌‌ పోస్టులకు 21 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్‌‌లైన్‌‌ టెస్ట్‌‌, డాక్యుమెంట్‌‌ వెరిఫికేషన్‌‌, ప్రీ రిక్రూట్‌‌మెంట్‌‌ మెడికల్‌‌ టెస్ట్‌‌ ఆధారంగా సెలెక్షన్​ ప్రాసెస్​ ఉంటుంది. 

ఎగ్జామ్​ ప్యాటర్న్​: పరీక్ష 200 మార్కులకి నిర్వహిస్తారు. దీనిలో నాలుగు విభాగాల నుంచి మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి.  పరీక్షా సమయం 2 గంటలు ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు చొప్పున నెగిటివ్‌‌ మార్కింగ్‌‌ ఉంటుంది.

అప్లికేషన్​ ప్రాసెస్​: అర్హులైన అభ్యర్థులు ఆన్‌‌లైన్‌‌లో జూన్​ 17 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.200, ఇతరులు రూ.1000 అప్లికేషన్​ ఫీజు చెల్లించాలి. ఎగ్జిక్యూటివ్‌‌ పోస్టులకు జులై 9, అసిస్టెంట్‌‌ మేనేజర్‌‌ పోస్టులకు జులై 23న పరీక్ష నిర్వహిస్తారు. సమాచారం కోసం www.idbibank.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.