దేశంలో 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం : రాహుల్ గాంధీ

దేశంలో  45 ఏళ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం  : రాహుల్ గాంధీ

గత 45 ఏళ్లలో దేశంలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం.. ఇప్పుడుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రతి సంవత్సరం 2 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పిస్తామని ప్రధాని మోడీ ఇచ్చిన హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. దేశంలోని కోట్లాది మంది యువత నిరుద్యోగులుగా మారారని తెలిపారు. కర్ణాటకలో 2.5 లక్షల ప్రభుత్వ పోస్టులు ఇంకా ఎందుకు ఖాళీగా ఉన్నాయని రాహుల్ ప్రశ్నించారు. ‘‘ కర్ణాటకలో పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ కావాలనుకుంటే రూ. 80 లక్షలు చెల్లిస్తే కావచ్చు. డబ్బుంటే కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగం కొనుక్కోవచ్చు. డబ్బు లేకపోతే జీవితాంతం నిరుద్యోగిగా ఉండొచ్చు’’ అని రాహుల్ వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా కర్ణాటకలోని బళ్లారిలో జరిగిన ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు.  

దేశాన్ని ముక్కలు చేయడమే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ భావజాలమని రాహుల్ ఆరోపించారు. అందుకే దేశాన్ని కలిపి ఉంచేలా ప్రజలను ఐక్యం చేసేందుకు తన పాదయాత్రకు భారత్ జోడో యాత్రగా నామకరణం చేశానన్నారు.  కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేకమన్నారు.