దుర్గామాత ఆలయంలో విగ్రహాలు ధ్వంసం.. భజరంగ్ దళ్ ధర్నా

దుర్గామాత ఆలయంలో విగ్రహాలు ధ్వంసం.. భజరంగ్ దళ్ ధర్నా

హైదరాబాద్: కూకట్‌ పల్లి సపదర్‌ నగర్‌‌లో దుర్గామాత ఆలయంలో దేవతా విగ్రహాలను కూల్చిన ఘటన సంచలనం రేపుతోంది. అమ్మవారి విగ్రహాన్ని పెకిలించడానికి దుండగులు ప్రయత్నం చేశారు. నాగదేవత విగ్రహాలను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న భజరంగ్ దళ్ నాయకులు ఘటనా స్థలం వద్దకు చేరుకొని ధర్నాకు దిగారు. కూకట్ పల్లి ఏసీపీ సురేందర్ రావుకు భజరంగ్ దళ్ నాయకులకు మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో ఆలయం దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.