ఆసియా కప్‌‌‌‌ స్టేజ్‌‌‌‌–3 టోర్నీలో .. పారా ఆర్చర్‌‌‌‌ శీతల్‌‌‌‌ దేవి

ఆసియా కప్‌‌‌‌ స్టేజ్‌‌‌‌–3 టోర్నీలో .. పారా ఆర్చర్‌‌‌‌ శీతల్‌‌‌‌ దేవి

కోల్‌‌‌‌కతా: రెండు చేతుల్లేకుండా జన్మించిన పారా ఆర్చర్‌‌‌‌ శీతల్‌‌‌‌ దేవి.. ఆసియా కప్‌‌‌‌ స్టేజ్‌‌‌‌–3 టోర్నీలో బరిలోకి దిగనుంది. గురువారం ఎంపిక చేసిన ఇండియా కాంపౌండ్‌‌‌‌ విమెన్స్‌‌‌‌ జట్టులో ఆమెకు చోటు దక్కింది. దాంతో శారీరకంగా ధృడమైన అథ్లెట్లతో కలిపి పోటీ చేయాలన్న శీతల్‌‌‌‌ కోరిక ఎట్టకేలకు ఫలించింది.

 సోనిపట్‌‌‌‌లో జరిగిన నేషనల్‌‌‌‌ ట్రయల్స్‌‌‌‌లో 60 మంది ఆర్చర్లు బరిలోకి దిగగా, నాలుగు రోజుల పోటీల తర్వాత 18 ఏళ్ల శీతల్‌‌‌‌ మూడో ప్లేస్‌‌‌‌లో నిలిచింది. క్వాలిఫయింగ్‌‌‌‌లో ఆమె 703 పాయింట్లు సాధించింది.  రికర్వ్‌‌‌‌ మెన్స్‌‌‌‌లో రాంపాల్ చౌదరి, రోహిత్ కుమార్, మయాంక్ కుమార్‌‌‌‌, విమెన్స్‌‌‌‌లో కొండపావులూరి యుక్త శ్రీ, వైష్ణవి కులకర్ణి, క్రతికా బిచ్పురియాకు, కాంపౌండ్‌‌‌‌ మెన్స్‌‌‌‌లో ప్రద్యుమన్ యాదవ్, వాసు యాదవ్, దేవాన్ష్ సింగ్, విమెన్స్‌‌‌‌లో తేజల్ సాల్వే, వైదేహి జాదవ్, శీతల్ దేవికి చోటు లభించింది.