శంషాబాద్ సిద్ధాంతి ఫ్లైఓవర్ పై తగలబడ్డ లారీ.. సద్దల లోడ్ తో వెళ్తుండగా..

శంషాబాద్ సిద్ధాంతి ఫ్లైఓవర్ పై తగలబడ్డ లారీ.. సద్దల లోడ్ తో వెళ్తుండగా..

శంషాబాద్ సిద్ధాంతి ఫ్లైఓవర్ పై అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం ( నవంబర్ 7 ) ఉదయం శంషాబాద్ సిద్ధాంతి ఫ్లైఓవర్ పై లారీ తగలబడింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సిద్ధాంతి వెజిటబుల్ మార్కెట్ దగ్గర హైదరాబాద్ బెంగుళూరు హైవే ఫ్లై ఓవర్ పై హైదరాబాద్ నుండి కర్ణాటక కు సద్దల లోడుతో వెళుతున్న లారీ లో ప్రమాదవ శాత్తుగా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

హెవీ లోడుతో వెళ్తున్న లారీ తగలబడటం గమనించిన డ్రైవర్ సద్దాం.. లారీని పక్కకు ఆపి, లారీ నుండి దూకేసి ప్రాణాలు కాపాడాడుకున్నాడు. చాలా సేపు వెయిట్ చేసినా ఫైర్ ఇంజిన్ రాకపోవడంతో స్థానికులు మున్సిపల్ సిబ్బందికి సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న మున్సిపల్ సిబ్బంది మున్సిపాలిటీకి చెందిన వాహనంతో మంటలను ఆర్పేశారు. సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చిన మున్సిపల్ సిబ్బందిని అభినందిస్తున్నారు స్థానికులు.

అనంతరం ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. లారీ ఓవర్ లోడ్ తో ఉండటమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.