దాతల్లో మేటి.. శివ్ నాడార్ విరాళం రూ. 2,708 కోట్లు

దాతల్లో మేటి..  శివ్ నాడార్ విరాళం రూ. 2,708 కోట్లు
  • రెండో స్థానంలో రిలయన్స్​
  • టాప్​-3లో బజాజ్​ గ్రూప్​
  • హురున్​ ఫిలాంత్రపీ లిస్ట్​ వెల్లడి

న్యూఢిల్లీ: హెచ్‌‌‌‌‌‌‌‌సీఎల్ ​టెక్​ ఫౌండర్​ శివ్‌‌‌‌‌‌‌‌ నాడార్,​ ఆయన కుటుంబం భారీగా సంపాదించడమే కాదు, సమాజం కోసమూ భారీ ఎత్తున ఖర్చు చేస్తోంది. శివ్‌‌‌‌‌‌‌‌ నాడార్​ ఫౌండేషన్​ ద్వారా గత ఏడాది రూ. 2,708 కోట్లు విరాళంగా ఇచ్చారు. రోజుకు రూ. 7.4 కోట్ల విరాళం ఇచ్చి ఆయన మనదేశంలో అత్యంత దానశీలిగా నిలిచారు. గత ఐదేళ్లలో   ఫౌండేషన్​ రూ. 10,122 కోట్లు విరాళంగా ఇచ్చింది. హురున్​

ఇండియా ఫిలాంత్రపీ లిస్ట్​ ​ప్రకారం..

రిలయన్స్ ఇండస్ట్రీస్ దాతృత్వ విభాగమైన రిలయన్స్​ ఫౌండేషన్​ రూ. 626 కోట్లతో ఈ జాబితాలో రెండో స్థానం దక్కించుకుంది.  సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద అత్యధికంగా రూ. 1,309 కోట్లు విరాళంగా ఇచ్చింది. ఇది తప్పనిసరి వ్యయం కంటే రూ. 261 కోట్లు ఎక్కువ.  బజాజ్ గ్రూప్​ ట్రస్ట్ రూ. 446 కోట్లు  ఇచ్చింది. ఈ లిస్టులోని 25 మంది కేవలం మూడేళ్లలో రూ. 50 వేల కోట్లు ఇచ్చారు.  అంటే రోజుకు సుమారు రూ. 46 కోట్లు! ఈ ఏడాది జాబితాలో 191 మంది దాతలు (12 మంది కొత్తవారు) ఉన్నారు. వీరంతా కలిపి రూ. 10,380 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఇది మూడేళ్ల క్రితంతో పోలిస్తే 85 శాతం ఎక్కువ. 

ఇన్ఫోసిస్ ​కో-ఫౌండర్ల భారీ దాతృత్వం

ఇన్ఫోసిస్ కో-–ఫౌండర్ నందన్​ నిలేకని, ఆయన భార్య రోహిణి నిలేకని వరుసగా రూ. 356 కోట్లు, రూ. 199 కోట్లు వ్యక్తిగత విరాళాలు ఇచ్చి రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఇన్ఫోసిస్ ​కో–-ఫౌండర్ల కుటుంబాలు (నందన్​ నిలేకని, క్రిస్​ గోపాలకృష్ణన్​, కె. దినేశ్​, రోహిణి నిలేకని, కుమారి శిబులాల్) ఈ ఏడాది మొత్తం రూ. 850 కోట్లకు పైగా విరాళాలు ఇచ్చి రికార్డు సృష్టించారు. రంజన్​ పాయ్​, ఆయన కుటుంబం రూ. 160 కోట్లు ఇచ్చింది.    

రూంగ్తా సన్స్ రూ. 181 కోట్లు, జిందాల్​ స్టీల్​ అండ్​ పవర్ రూ. 267 కోట్లు సీఎస్​ఆర్​కు కేటాయించాయి. ఈ జాబితాలో 24 మంది మహిళలు ఉండగా, రోహిణి నిలేకని రూ. 204 కోట్లు విరాళంగా ఇచ్చి భారతదేశంలో అత్యంత దయాగుణం గల మహిళగా నిలిచారు. బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్​ మజుందార్​-షా రూ. 83 కోట్లు, బీణా షా రూ. 69 కోట్లు విరాళంగా ఇచ్చారు. యువ ఇండస్ట్రియలిస్టుల్లో  జెరోధాకు చెందిన నిఖిల్​ కామత్, నితిన్​ కామత్, బిన్నీ బన్సాల్, అదర్​ పూనావాలా ప్రముఖంగా ఉన్నారు. కామత్​ సోదరులు రూ. 147 కోట్లు విరాళంగా ఇచ్చారు.