బ్యాటరీ రంగంలో దూసుకెళ్తాం : జయేశ్​ రంజన్​

బ్యాటరీ రంగంలో దూసుకెళ్తాం : జయేశ్​ రంజన్​
  •    పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్​ సెక్రెటరీ జయేశ్​ రంజన్​

హైదరాబాద్​, వెలుగు : భారతదేశం 2030 నాటికి 150 గిగావాట్​అవర్ అడ్వాన్స్​కెమిస్ట్రీ సెల్​​ (ఏసీసీ) లక్ష్యాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్యశాఖ ప్రిన్సిపల్​ సెక్రటరీ   జయేష్ రంజన్ అన్నారు.  ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ (ఐఈఎస్​ఏ) హైదరాబాద్​లో మంగళవారం నిర్వహించిన 3వ వార్షిక ఇండియా బ్యాటరీ తయారీ  సప్లై చైన్ సమ్మిట్ ‘ఐబీఎంఎస్​సీఎస్​’లో ఆయన మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు.  దేశంలోని 150 ఏసీసీ గిగావాట్​అవర్​ బ్యాటరీ తయారీలో, తెలంగాణ వాటా 30 గిగావాట్​అవర్ ఉందని చెప్పారు.  

రాష్ట్రంలో 16 గిగావాట్​అవర్​ తయారీ కేంద్రం ఏర్పాటుకు అమర రాజా పెట్టుబడులు పెడుతున్నదని ఆయన పేర్కొన్నారు. వారం రోజుల క్రితం దావోస్​లో తెలంగాణ ప్రభుత్వం  12 గిగావాట్​అవర్​ బ్యాటరీ తయారీ ప్లాంటు ఏర్పాటు కోసం జీఓడీఐతో ఒప్పందంపై సంతకం చేసిందని,    కొన్ని ఇతర కంపెనీలతో చర్చలు ముగింపుదశల్లో ఉన్నాయని ఆయన వివరించారు.