దాడులు చేస్తే..అమెరికా ఫోర్స్ మొత్తం మీపై అటాక్ చేస్తాయి: ఇరాన్కు ట్రంప్ వార్నింగ్

దాడులు చేస్తే..అమెరికా ఫోర్స్ మొత్తం మీపై అటాక్ చేస్తాయి: ఇరాన్కు ట్రంప్ వార్నింగ్

ఇజ్రాయెల్ లోని అమెరికా సైనిక స్థావాలపై జరిగితే తీవ్ర పరిణామాలుంటాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల,ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న క్రమంలో ట్రంప్ హెచ్చరికలు చేశారు. తమపై దాడికి అమెరికా బలగాలు సాయం చేస్తున్నాయని ఇరాన్  ఆరోపిస్తున్న క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఏ రూపంలోనైనా అమెరికాపై దాడి చేస్తే అమెరికా సాయుధ దళాల పూర్తి బలం,శక్తి ఇంతకు ముందెన్నడూ చూడని స్థాయిలో దాడి చేస్తుందని అన్నారు. 

ఇటీవల ఇరాన్‌పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో అమెరికా ప్రమేయాన్ని ఆయన ఖండించినప్పటికీ ఇజ్రాయెల్‌కు తన మద్దతును స్పష్టం చేశారు. ఇరాన్ మరింత దూకుడుగా వెళ్లొద్దని హెచ్చరించారు. ఇరాన్ దాడి చేస్తూనే ఉంటే పరిస్థితి మరింత దిగజారిపోతుందన్నారు. ఈ రక్తపాత వివాదాన్ని ముగించడానికి ఇరాన్ ,ఇజ్రాయెల్ మధ్య సులభంగా ఒక ఒప్పందం కుదరవచ్చని కూడా ట్రంప్ అన్నారు. 

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దాడులు, ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. శనివారం రాత్రి ఇరాన్ పై ఇజ్రాయెట్ భారీ ఎత్తున క్షిపణి దాడులు చేసింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ కు సాయం చేస్తుందని అమెరికాతో ఆరో దఫా చర్చలు ఇరాన్ రద్దు చేసుకుంది. ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్ లో ఈ విషయంపై స్పందించారు. అయినప్పటికీ ఇరాన్,ఇజ్రాయెల్ మధ్య సులభంగా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుని ఈ వివాదాన్ని ముగించగలనని పేర్కొన్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం(జూన్15) ఇరాన్‌ను అమెరికా ఆస్తులపై ప్రతీకారం తీర్చుకోవద్దని హెచ్చరించారు. ఇరాన్ మనపై ఏ విధంగానైనా, రూపంలోనైనా దాడి చేస్తే, అమెరికా సాయుధ దళాల పూర్తి బలం ,శక్తి ఇంతకు ముందు ఎన్నడూ చూడని స్థాయిలో మీపైకి వస్తుంది" అని ట్రంప్ ట్రూత్ సోషల్ రాశారు. 

ఇజ్రాయెల్ శనివారం టెహ్రాన్‌లోని ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. అంతేకాదు ఇరాన్‌లోని బుషెహర్ ప్రావిన్స్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయువు ప్రాసెసింగ్ యూనిట్‌ను దాడి చేసిన క్రమంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతీకారంగా ఇజ్రాయెల్ నగరాలైన తామ్రా, బాట్ యామ్,రెహోవోట్‌లలో కనీసం పది మంది మరణించగా, 200 మందికి పైగా గాయపడ్డారు. తామ్రాలో నలుగురు మరణించగా, బాట్ యామ్‌లో ఆరుగురు మరణించినట్లు రిపోర్స్ట్ చెబుతున్నాయి.

ALSO READ | దుబాయ్లో 67 అంతస్తుల ‘టైగర్ టవర్’లో భారీ అగ్ని ప్రమాదం

ఇరాన్ అణు కేంద్రాలు, శాస్త్రవేత్తలు ,ఉన్నత సైనిక అధికారులను లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్‌కు ప్రతిస్పందనగా.. టెహ్రాన్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3ని ప్రారంభించింది. ఇరాన్ దాడులు శనివారం రాత్రి ప్రారంభమై తెల్లవారుజామున కొనసాగాయి.

మరోవైపు ఇజ్రాయెల్ టెహ్రాన్ పై బాంబులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్ క్షిపణి దాడుల్లో 29 మంది పిల్లలు సహా కనీసం 60 మంది మరణించారని ఇరాన్ అధికారులు తెలిపారు. ఉత్తర ఇజ్రాయెల్‌లోని ఒక ఇంటి సమీపంలో జరిగిన దాడిలో ముగ్గురు మహిళలు మరణించగా పది మంది గాయపడ్డారు. 
దీనికి ప్రతిస్పందనగా టెహ్రాన్ ఇజ్రాయెల్‌పై కొత్త క్షిపణుల దాడి చేసింది. ఇజ్రాయెల్ పై ఇరానియన్ క్షిపణులు జరిపిన దాడిలో గలిలీ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్ భవనంలో ధ్వసమైంది. నలుగురు మృతిచెందారు. 

ఇరాన్, ఇజ్రాయెల్ దాడులు, ప్రతీకార దాడుల క్రమంలో ట్రంప్ తాజా వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ లోని అమెరికా సైనిక స్థావాలపై జరిగితే తీవ్ర పరిణామాలుంటాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల,ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న క్రమంలో ట్రంప్ హెచ్చరికలు చేశారు. తమపై దాడికి అమెరికా బలగాలు సాయం చేస్తున్నాయని ఇరాన్  ఆరోపిస్తున్న క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఏ రూపంలోనైనా అమెరికాపై దాడి చేస్తే అమెరికా సాయుధ దళాల పూర్తి బలం,శక్తి ఇంతకు ముందెన్నడూ చూడని స్థాయిలో దాడి చేస్తుందని అన్నారు.