
కొచ్చి: కేరళలో బీజేపీ అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్‌ను రూ.60కే అందిస్తామని ఆ పార్టీ సీనియర్ నేత కుమ్మనం రాజశేఖరన్ అన్నారు. త్వరలో కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొచ్చిలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రాజశేఖరన్ ఈ హామీ ఇచ్చారు. బీజేపీ పవర్‌లోకి వస్తే పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తామని, అప్పుడు చమురు ధరలు రూ.60 లోపే ఉంటాయని స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నందున వాటిని జీఎస్టీ పరిధిలోకి ఎందుకు తీసుకురావడం లేదని రాష్ట్రంలోని అధికార ఎల్డీఎఫ్‌ను ప్రశ్నించారు.