కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణ అవినీతి మయం : రాంచందర్ రావు

కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణ అవినీతి మయం :  రాంచందర్ రావు

హైదరాబాద్,వెలుగు :  కాంగ్రెస్ గెలిస్తే అవినీతి రాజ్యమేలుతుందని, ఎట్టి పరిస్థితుల్లో ఆ పార్టీని గెలిపిం చొద్దని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు అన్నారు. రాజ స్థాన్ లో గేమింగ్ యాప్ సంపాదిం చిన కోట్లాది రూపాయలను అక్కడి కాంగ్రెస్ నేతలు ఎన్నికల కోసం ఖర్చు చేస్తున్నారని, తెలంగాణ కాంగ్రెస్​లోనూ అలాంటివాళ్లే ఉన్నారని ఆరోపించారు. మంగళ వారం సోమాజిగూడలోని బీజేపీ మీడియా పాయింట్ వద్ద రాంచం దర్ రావు మాట్లాడారు. కర్నాటక మంత్రుల ఇండ్లలో భారీగా డబ్బు పట్టుబడుతోందని గుర్తుచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధ్యక్షుడే అవినీతి పరుడని ఆరోపించారు.