గుడుల్లో హుండీలు తీసేస్తే.. పూజారులే ఉండరు : కాంగ్రెస్​ నేత విజయ్​ వడెత్తివార్​

గుడుల్లో హుండీలు తీసేస్తే.. పూజారులే ఉండరు : కాంగ్రెస్​ నేత విజయ్​ వడెత్తివార్​
  • మహారాష్ట్ర కాంగ్రెస్​ నేత వడెత్తివార్

నాగపూర్: దేవాలయాల్లో హుండీలను తొలగిస్తే..  పూజారులు ఆలయాలను విడిచి వెళ్లిపోతారంటూ మహారాష్ట్ర కాంగ్రెస్​ నేత విజయ్​ వడెత్తివార్​ చేసిన  కామెంట్లు దుమారం రేపాయి. మహారాష్ట్రలోని  పర్భనిలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఈ కామెంట్లు చేయగా.. వాటిపై వచ్చిన ప్రశ్నలపై ఆయన సోమవారం ప్రెస్​మీట్​లో స్పందించారు.  తాను చేసిన కామెంట్లకు కట్టుబడే ఉన్నానని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో  కుల, మతాల మధ్య  కలహాలు పెంచుతున్న పరిస్థితి ఉందన్నారు.

గొడవలు సృస్టించేందుకు మతాలను వాడుకుంటున్నారని పేర్కొన్నారు. గతంలో  ఈ పరిస్థితులు లేవని చెప్పారు. దేశంలో శాంతి, శ్రేయస్సుకు అంబేద్కర్​ లాంటి వాళ్లు ఎంతో కృషి చేశారని తెలిపారు. ఒకవేళ అంబేద్కర్​ బౌద్ధ మతం కాకుండా ఇస్లాం మతం స్వీకరించి ఉంటే..  కొందరు ఈ దేశాన్ని రెండు ముక్కలు చేసేవారని అభిప్రాయపడ్డారు.  గతంలో సాహితీవేత్తలు కూడా ఈ విషయాన్ని చెప్పినట్టు విజయ్ వడెత్తివార్ గుర్తు చేశారు.