కొత్త ఈసీ నియామక ఫైల్ ఇవ్వండి.. కేంద్రానికి సుప్రీం ఆదేశం

కొత్త ఈసీ నియామక ఫైల్ ఇవ్వండి.. కేంద్రానికి సుప్రీం ఆదేశం

ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల ఎలక్షన్ కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న అరుణ్ గోయల్ నియామక ఫైల్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా పని చెయ్యాలని సూచించింది. ప్రధానమంత్రిపై ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకునే పారదర్శకత కమిషన్ సభ్యుల్లో ఉండాలని సుప్రీం కామెంట్ చేసింది. ఎన్నికల అధికారులు రాజకీయ పార్టీల ప్రభావం నుంచి దూరంగా ఉండాలంటూ.. కాంగ్రెస్ లీడర్ అనూప్ భరన్వాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషనర్ తరపున సీనియర్ అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్ వాదించారు.  

“ప్రధాన ఎన్నికల అధికారి నియామక కమిటీలో సీజేఐని చేర్చాలి... సీఈసీ, ఈసీల నియామకానికి కొలీజియం లాంటి వ్యవస్థ ఏర్పాటు చేయాలి” అని వాదించారు. ఎలక్షన్ కమిషనర్ అరుణ్ గోయల్ నియామకంపై పిటిషనర్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ నెల 17 వరకు కేంద్ర అధికారిగా పనిచేసిన IAS అరుణ్ గోయల్ నవంబరు 18న వీఆర్ఎస్ ప్రకటించారని చెప్పారు. 19న అరుణ్ గోయల్ ను ఈసీగా నియమించారని చెప్పారు. దీంతో అరుణ్ గోయల్ నియామకం ఫైల్ ఇవ్వాలంటూ విచారణను సుప్రీం కోర్టు రేపటికి వాయిదా వేసింది.