- ఆర్.కృష్ణయ్య హెచ్చరిక
ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేయాలని చూస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. మంగళవారం సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు.
ప్రభుత్వం తన కుట్రలను మానుకొని ఫీజుల పథకాన్ని యధాతథంగా అమలు చేయాలని, లేనిపక్షంలో జూన్ చివరి వారంలో 5 లక్షల మంది విద్యార్థులతో సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
అధికారంలోకి వచ్చి 30 నెలలవుతున్నా విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరించారని, బడ్జెట్ కొరత సాకుతో రూ. 8 వేల కోట్ల బకాయిలు ఆపడం అన్యాయమని మండిపడ్డారు. ముఖ్యంగా జీవో నెం.07 ద్వారా పథకాన్ని అటకెక్కించాలని చూడటం వల్ల కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ఫీజులు ముక్కుపిండి వసూలు చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం నందికొండ రమేశ్‌ను రాష్ట్ర జనరల్ సెక్రటరీగా, మేకల శ్రీధర్‌ను జాయింట్ సెక్రటరీగా నియమిస్తూ ఉత్తర్వులు అందజేశారు.
