పోలీస్ కమిషనర్ అయితే ఫోన్ ఇవ్వరా.. ఎగ్జామ్ సెంటర్ సెక్యూరిటీలో కానిస్టేబుల్

పోలీస్ కమిషనర్ అయితే ఫోన్ ఇవ్వరా..  ఎగ్జామ్ సెంటర్ సెక్యూరిటీలో కానిస్టేబుల్

ఇటీవల రాష్ట్రంలో సంచలనంగా మారిన పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతల నడుమ పరీక్షలు నిర్వహిస్తు్న్నారు. విద్యార్థులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించేటప్పుడు విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించే, చెక్ చేశాకే లోపలికి పంపిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురుకాకుండా భారీ బందోస్తుతో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు సైతం ఎగ్జామ్ సెంటర్ లోకి వెళ్లే ముందు తమ ఫోన్లను బయటే వదిలి వెళ్లాలనే నిబంధనను కఠినంగా ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలో ఓ ఎగ్జామ్ సెంటర్ లోకి వెళ్లబోతున్న రాచకొండ సీపీ చౌహన్ ను అక్కడే ఉన్న సెక్యూరిటీ మహిళా కానిస్టేబుల్ అడ్డుకున్నారు. లోపలికి ఫోన్ అనుమతి లేదని స్పష్టం చేశారు.

తనపై అధికారి అని కూడా చూడకుండా నిబంధనలను కఠినంగా నిర్వహిస్తోన్న మహిళా కానిస్టేబుల్ ను ఈ సందర్భంగా రాచకొండ సీపీ చౌహన్ అభినందించారు. డ్యూటీపై ఆమెకున్న నిబద్ధతను మెచ్చుకున్నారు. ఆ తర్వాత తన ఫోన్ ను ఆమెకు ఇచ్చి, ఎగ్జామ్ సెంటర్ లోకి వెళ్లిపోయారు. పరీక్ష నిర్వహణను సమీక్షించిన సీపీ.. బయటికొచ్చిన తర్వాత మహిళా కానిస్టేబుల్ కు రివార్డ్ అందజేయడం అందర్నీ ఆకట్టుకుంది. సీపీ చౌహాన్  సీపీకే ఎంట్రీ ఇవ్వకుండా రూల్స్ ను కట్టుదిట్టంగా అమలు చేస్తోన్న ఆ మహిళా కానిస్టేబుల్ ను ఈ సందర్భంగా అందరూ పొగుడుతున్నారు. ఇలాంటి అధికారులుంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగవని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా అక్కడున్న కొంతమంది ఈ వీడియోను తీసి షేర్ చేయగా.. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.