
- రాజకీయాలంటే విరక్తి పుడుదున్నది
- మోదీని చూసే రాజకీయాల్లో కొనసాగుతున్నా
- మున్నూరు కాపు ఆత్మీయ సభలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్
సికింద్రాబాద్, వెలుగు: “ మళ్లీ కేసీఆర్ సీఎం అవుతాడని అక్బరుద్దీన్ ఒవైసీ చెబుతున్నడు. అక్బరుద్దీన్ ఒవైసీ మాటను మీరు శిరసావహించి కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేస్తే మీకు అక్బరుద్దీన్ చుట్టమైతడు ” అని బీజేపీ జాతీయ కార్యదర్శి బండ సంజయ్ అన్నారు. ఆదివారం సికింద్రాబాద్ లోని సిఖ్ విలేజ్ లో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సభకు బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. “కేసీఆర్ తర్వాత కేటీఆర్ సీఎం కావాలట.. సీఎం పదవి కేటీఆర్ అయ్యా జాగీరా? తెలంగాణలో మళ్లీ సీఎం అయితే పేదోడే కావాలి. పేదల గురించి ఆలోచించే పార్టీ అధికారంలోకి వస్తేనే పేదల బతుకులు బాగుపడతాయి”అని న్నారు.
కేసీఆర్ మళ్లీ వస్తే బిచ్చపు బతుకులే అన్నారు. రాజకీయాలను చూస్తే విరక్తి పుడుతుందన్నారు. ప్రధాని మోదీని చూసి రాజకీయాల్లో కొనసాగుతున్నానన్నారు. సామాన్య కార్యకర్తగా ఉన్న నాకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశమిచ్చిందన్నారు. అనంతరం ఎంపీగా, రాష్ట్ర అధ్యక్షుడిగా చేసిందని ప్రస్తుతం జాతీయ ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించిందన్నారు. బీజేపీలో కష్టపడి పనిచేసే మున్నూరు కాపులకు అనేక పదవులొస్తాయనడానికి తానే ఉదాహరణ అన్నారు.