సినీ పెద్దలంతా స్పందించాలి

సినీ పెద్దలంతా స్పందించాలి

ఆంధ్రప్రదేశ్ లో  సినిమా థియేటర్లు మూసేస్తుంటే ఏడుపొస్తోందని ఆర్.నారాయణమూర్తి అన్నారు. ఇవాళ జరిగిన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా సక్సెస్ మీట్ లో విప్లవ సినిమాల నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్ . నారాయణమూర్తి పాల్గొన్నారు. సినిమా తీసేవాడు, చూపించేవాడు, చూసేవాడు ఉంటేనే పరిశ్రమ బాగుంటుంది అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఏపీలో పరిస్థితిని గురించి ప్రస్తావిస్తూ సినిమా థియేటర్లు మూసేస్తుంటే ఏడుపొస్తుందంటూ.. థియేటర్ యజమానులారా సినిమా హాల్స్ ను మూసేయకండి.. అధైర్య పడకండి అని అన్నారు.

థియేటర్ల మూసివేత విషయంలో నిర్మాతల మండలి, మా అసోసియేషన్ జోక్యం చేసుకోవాలని, సినీ పరిశ్రమను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పండుగ వేళ సినీ పరిశ్రమకు గడ్డుకాలం రాకూడదని నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. థియేటర్ యజమానులు భావోద్వేగానికి గురికాకుండా ఎమ్మెల్యేలు, మంత్రులను కలిసి సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్ , సురేష్ బాబు సహా పెద్దలంతా ప్రస్తుత పరిస్థితులపై దృష్టి పెట్టాలని నారాయణమూర్తి కోరారు. 

 

ఇవి కూడా చదవండి:

రాజకీయ నిరుద్యోగులంతా ఒకరోజు దీక్ష చేస్తున్నారు

డబుల్ బెడ్రూం ఇళ్లను ఆక్రమించుకున్న స్థానికులు

మేం ఇలాగే అణచివేసి ఉంటే తెలంగాణ వచ్చేదా..?