డబుల్ బెడ్రూం ఇళ్లను ఆక్రమించుకున్న స్థానికులు

డబుల్ బెడ్రూం ఇళ్లను ఆక్రమించుకున్న స్థానికులు
  • ఇండ్లు అడిగితే.. డ్రాలో వేరేవాళ్లకు వచ్చిందంటున్నారని ఆవేదన
  • జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం ఆత్మకూరులో 8 ఇళ్ల ఆక్రమణ

జగిత్యాల జిల్లా: మెట్ పల్లి మండలం ఆత్మకూర్ లో 8 డబుల్ బెడ్ రూం ఇండ్లను ఆక్రమించుకున్నారు స్థానికులు. కాంగ్రెస్ హయాంలో తమకు భూములు కేటాయించారంటున్నారు బాధితులు. అప్పుడు స్థోమత లేకపోవడంతో ఇండ్లు కట్టుకోలేక పోయామన్నారు. తమ భూముల్లో డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇస్తామని అధికారులు చెప్పారన్నారు. ఇండ్లు ఇవ్వాలని అడిగితే డ్రాలో ఇతరులకు వచ్చినట్లు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనవరి 1న ఇండ్ల కేటాయింపు జరగనుండగా.. ఇవాళ 8 ఇండ్లను ఆక్రమించుకున్నారు స్థానికులు.

 

ఇవి కూడా చదవండి:

మేం ఇలాగే అణచివేసి ఉంటే తెలంగాణ వచ్చేదా..?

కిలోల కొద్దీ బంగారం.. నోట్ల గుట్టలు సీజ్