
ఓ బాలుడు తప్పిపోగా..తల్లిదండ్రలు డయల్ 100కి కాల్ చేశారు. స్పదించిన పోలీసులు కొన్ని గంటల్లోనే ఆ బాలుడిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఘటన సిరిసిల్ల జిల్లాలో జరిగింది. అర్జున్ అనే నాలుగేళ్ల బాలుడితో తల్లిదండ్రలు హైదరాబాద్ నుంచి సిరిసిల్లాకు వెళ్లారు. శనివారం అర్థరాత్రి తల్లిదండ్రుల నుంచి ఆ బాలుడు తప్పిపోయాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు డయల్ 100 కు ఫోన్ చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు ఆ బాలుడిని వెతికి పట్టుకుని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.