రెండేళ్లలో కరోనాకు వ్యాక్సిన్ రాకుంటే 10 లక్షల మంది తగ్గుతరట

రెండేళ్లలో కరోనాకు వ్యాక్సిన్ రాకుంటే 10 లక్షల మంది తగ్గుతరట

ఆస్ట్రేలియాలో పరిస్థితిని అంచనా వేసిన కేపీఎంజీ కన్సల్టెన్సీ

సిడ్నీ: ప్రపంచవ్యాప్తంగా కరోనాతో ఇప్పటికే వేలాదిమంది చనిపోయారు. చనిపోతున్నారు. వైరస్ సెకెండ్, థర్డ్ వేవ్ ఉండొచ్చన్న హెచ్చరికలు ఇప్పటికే వినిపిస్తుండగా.. దాని ఎఫెక్ట్ ఫ్యూచర్లో కూడా ఉంటుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కారణంగా ఆస్ట్రేలియా జనాభా తగ్గుతుందని, ఎకానమీపై ఏడాదికి 117 బిలియన్ డాలర్ల(సుమారు రూ.8.78లక్షల కోట్లు) ఎఫెక్ట్ పడుతుందని కేపీఎంజీ కన్సల్టెన్సీ వెల్లడించింది. వచ్చే రెండేళ్లలో వ్యాక్సిన్ కనుక రాకపోతే.. 2030 నాటికి అంచనా వేసిన దానికంటే జనాభాలో 10 లక్షల మంది తగ్గుతారని హెచ్చరించింది. ఇంటర్నేషనల్ స్టూడెంట్లను, ఆకర్షించేందుకు ఆస్ట్రేలియా మరింత దూకుడుగా ఏర్పాట్లు చేయాలంది. దీంతో మైగ్రేషన్ సంబంధిత అంశాలపై అక్టోబర్‌‌‌‌లో ప్రభుత్వం ఒక ప్రకటన చేయనుంది.

ఫ్యూచర్ కు ఎఫెక్ట్
ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థ పై కరోనా దీర్ఘకాలిక ప్రభావాలు చూపుతుందని కేపీఎంజీ కన్సల్టెన్సీ అంచనా వేసింది. ఒకవేళ 12 నెలల్లోగా వ్యాక్సిన్ వచ్చినా కూడా.. 2030 నాటికి కనీసం 4.2 లక్షల మంది తగ్గుతారని తెలిపింది. అదే రెండేళ్లలోపు వ్యాక్సి న్ రాకుంటే 2030 నాటికి అంచనా కంటే జనాభాలో 10 లక్షల మంది తగ్గొచ్చని చెప్పింది. దీంతో వచ్చేపదేళ్లలో 2.9 కోట్లుగా ఉండాల్సిన ఆస్ర్టేలియా జనాభా.. 2.8 కోట్లకే పరిమితం కానుందని వివరించింది.

For More News..

స్వచ్ఛ పోటీల్లో ఇండోర్ మళ్లీ టాప్

టీచర్లకు చెప్పొస్తలె.. పిల్లలకు సమజైతలె

11 రోజుల్లో ఢిల్లీలో రికార్డు వర్షం