
- బకాయిలు చెల్లించకపోతే నల్లా కనెక్షన్లు కట్‌చేయండి
- వాటర్‌బోర్డు ఎండీ దానకిశోర్
హైదరాబాద్, వెలుగు: కమర్షియల్ నల్లా కనెక్షన్ల బకాయిల విషయంలో కఠినంగా వ్యవహరించాలని వాటర్‌బోర్డు ఎండీ దానకిశోర్ అధికారులను ఆదేశించారు. గురువారం ఖైరతాబాద్‌లోని హెడ్డాఫీసులో రెవెన్యూ, ఇతర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరు నెలలకు పైగా నల్లా బిల్లులు చెల్లించని కమర్షియల్ కనెక్షన్లను తొలగించాలని స్పష్టం చేశారు. స్లమ్ ఏరియాల్లోని వినియోగదారులను బిల్లులు చెల్లించాలని ఒత్తిడి చేయొద్దని సూచించారు. నాన్ ఫ్రీ వాటర్ స్కీమ్(నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీటి పథకానికి దరఖాస్తు చేసుకోని) కనెక్షన్ల బకాయిలు వసూలు చేయాలని చెప్పారు. ఇప్పటికే వీరికి 13 నెలల బిల్లులను రద్దు చేశామని, దరఖాస్తుకు చాలాసార్లు అవకాశం ఇచ్చాయని తెలిపారు. ఇప్పుడైనా బకాయిలు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. సమావేశంలో వాటర్‌బోర్డు రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్, టెక్నికల్ డైరెక్టర్ రవి కుమార్, ఓఅండ్ఎం డైరెక్టర్ స్వామి, సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మీగూడలో నీటి సమస్యను పరిష్కరించండి
శంషాబాద్: మైలార్ దేవ్ పల్లి డివిజన్ లక్ష్మీగూడ రాజీవ్ గృహకల్ప అపార్ట్ మెంట్లలోని తాగునీటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి గురువారం హెడ్డాఫీ సులో వాటర్ బోర్డు ఎండీ దానకిశోర్‌ను కలిశారు. డివిజన్ పరిధిలోని పలు బస్తీలు, కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరారు. దానకిశోర్ స్పందిస్తూ.. స్థానిక అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.