ప్రజలపై అజమాయిషీ వద్దు : గుత్తా సుఖేందర్ రెడ్డి

ప్రజలపై అజమాయిషీ వద్దు : గుత్తా సుఖేందర్ రెడ్డి

శాసన మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి సిట్టింగ్​ ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో సఖ్యతతో ఉండాలని సూచించారు. ప్రజలపై అజమయిషీ చేయొద్దని సూచించారు. వారితో ప్రేమగా ఉండాలన్నారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమేనని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒకసారి గెలిచిన ఎమ్మెల్యేల రెండోసారి గెలవడం చాలా సందర్భాల్లో కష్టమేనన్నారు. కానీ 2014లో గెలిచిన మెజారిటీ ఎమ్మెల్యేలు 2018లో గెలిచారు. టీఆర్ఎస్​ అధినేత కేసీఆర్​ కృషి వల్లే వాళ్లు గెలిచారన్నారు.

ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్​ మీటింగ్​ తో దేశంలోని సెక్యులర్లు లీడర్లు అంతా ఏకమయ్యారని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఈ సభ దేశ లౌకిక విధానికి మార్గదర్శకంగా నిలిచిందన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందినట్టుగానే దేశం మొత్తం అభివృద్ధి చెందాలని సభకు వచ్చిన వాళ్లంతా గుర్తించారని చెప్పారు. ముందస్తు పై రేవంత్ చెప్పారని ఈ విషయం ఆయననే అడగాలన్నారు. ఆయన్ని ఎవరు పట్టించుకోరని వ్యాఖ్యానించారు. బట్టకాల్చి మీద వేయడం రేవంత్​ కు అలవాటేనని పేర్కొన్నారు.