లేబర్​గా మారిన సర్పంచ్​

లేబర్​గా మారిన సర్పంచ్​


మల్యాల, వెలుగు: అప్పులు చేసి గ్రామాభివృద్ధి పనులు చేయిస్తే.. బిల్లులు రాక ఓ సర్పంచ్ ​కూలీగా మారాడు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం గొర్రెగుండం జీపీ సర్పంచ్ సుంకే లచ్చయ్య పల్లె ప్రకృతి వనం కోసం రూ. 3 లక్షలు, శానిటేషన్, స్ట్రీట్ లైట్స్, ఆఫీస్ మెయింటెనెన్స్ ​కోసం మరో రూ. 3 లక్షలు అప్పు చేశాడు. రెండేళ్లుగా పల్లె ప్రకృతి వనం బిల్లులు రాలేదు. స్పెషల్ బిల్లు వచ్చే అవకాశం లేదని ఆఫీసర్లు తేల్చి చెప్పారు. చిన్న జీపీ కావడంతో రూ. 34 వేల ఆదాయం ఉండగా, ఖర్చు మాత్రం రూ. 40 వేలు వస్తోంది. దీంతో ప్రతినెలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో ఎల్ఐసీ ఏజెంట్​గా చేసిన లచ్చయ్య గ్రామస్థుల ప్రోద్బలంతో కొత్తగా ఏర్పడిన జీపీ అని రాజకీయాల్లోకి వచ్చాడు. ప్రస్తుతం అటు ఉపాధి పోయి, ఇటు బిల్లులు రాక అప్పులపాలై బోర్లు రిపేరు చేసే మెకానిక్ దగ్గర డైలీ లేబర్​గా చేస్తున్నాడు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ ను పలుసార్లు కోరినట్లు లచ్చయ్య చెప్పారు. ప్రభుత్వం చిన్న జీపీలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.