సీఎం కుర్చీ నచ్చకపోతే రాజీనామా చెయ్

సీఎం కుర్చీ నచ్చకపోతే రాజీనామా చెయ్
  • కేసీఆర్ కామెంట్లు రాజ్యాంగ వ్యవస్థకు అవమానం: డీకే అరుణ

హైదరాబాద్, వెలుగు: రాజ్యాంగం ద్వారా వచ్చిన సీఎం పదవిని ఎడమ కాలి చెప్పుతో పోల్చడం కేసీఆర్ అహంకారానికి నిదర్శనమని బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ మండిపడ్డారు. ప్రజలు ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో ఓట్లేసి గెలిపించి ఇచ్చిన సీఎం కుర్చీని హేళ‌‌‌‌న చేయ‌‌‌‌డం అంటే ప్రజాస్వా మ్యాన్ని, రాజ్యాంగ వ్యవస్థను అవమానించడమేనని మంగళవా రం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం తన కామెంట్లను వెనక్కి తీసుకోవాలన్నారు. ప్రజలు ఓట్లేసి గెలిపించిన సీఎం కుర్చీ నచ్చకపోతే రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి

క్షణాల్లో కరోనా రిజల్ట్‌‌‌‌‌‌‌‌.. వాసనతో పట్టేస్తున్న ఆర్మీ డాగ్స్

ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా వచ్చిపోయింది

V6 వెలుగు’ కథనాన్ని పిల్ గా తీసుకోండి

గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎవరు..?