పాలించలేనోడే రాజ్యాంగాన్ని మార్చాలంటడు

పాలించలేనోడే రాజ్యాంగాన్ని మార్చాలంటడు

రాజ్యాంగం నచ్చనివారు దేశం విడిచి  వెళ్లిపోవాలని కాంగ్రెస్ నేత, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్ అన్నారు. కేసీఆర్ కు అయినా సరే.. ఇంకేవరికైనా సరే ఇదే వర్తిస్తుందని ఆయన అన్నారు. మనుషులకు పుట్టినోళ్లు రాజ్యాంగం కావాలంటున్నారని... మానుకు పుట్టినోడు రాజ్యాంగం వద్దు అంటున్నారని దయాకర్ విమర్శించారు. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని ఆయన హెచ్చరించారు. ఇప్పటి వరకు రాజ్యాంగం కేవలం 25 శాతం కూడా అమలు చేయలేదని ఆయన అన్నారు. పాలించలేనోడే రాజ్యాంగాన్ని మార్చాలి అంటారని దయాకర్ అన్నారు. అంబెడ్కర్ కృషి వల్ల ప్రపంచానికి భారత్ ఆదర్శంగా నిలుస్తోందని ఆయన అన్నారు. రాజ్యాంగం అంటే ఒక్క రిజర్వేషన్లు మాత్రమే కాదని దయాకర్ తేల్చి చెప్పారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ మాట్లాడుతున్నదే  కేసీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు జాతీయ స్థాయిలో ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. రాజ్యాంగం మార్చాలనుకునే వాళ్ళు ఎందుకు మార్చాలో  చర్చకు రావాలని.. అందుకు తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు.