మైనర్లకు వెహికల్ ఇస్తే జైలుకే

మైనర్లకు వెహికల్ ఇస్తే జైలుకే

సికింద్రాబాద్, వెలుగు:  మైనర్లకు వెహికల్ ఇవ్వడం నేరమని.. అలా ఇచ్చిన వారిపై సైతం చట్టప్రకారం చర్యలుంటాయని బేగంపేటలోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్(టీటీఐ) సీఐ నాగరాజు తెలిపారు. టీటీఐ ఆధ్వర్యంలో నల్లకుంట ట్రాఫిక్ పీఎస్ పరిధిలోని కాలేజీల్లో సోమవారం అవగాహన సదస్సులను నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా రోడ్డు భద్రత, ట్రాఫిక్ రూల్స్ గురించి స్టూడెంట్లకు వివరించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. ఓవర్ స్పీడ్ ఎప్పుడూ ప్రమాదకరమేనని తెలిపారు. సిగ్నల్స్ వద్ద రూల్స్ పాటించాలన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ రామకృష్ణ, కాలేజీ ప్రిన్సిపల్ దేవి, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.