
బార్డర్ లో( LoC ) తరచూ కాల్పులు జరుపుతూ భారత్ లోకి తీవ్రవాదులను పంపుతున్న పాకిస్తాన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు భారత క్రికెట్ మాజీ దిగ్గజం కపిల్ దేవ్. బార్డర్‌లో భారత్ ను దెబ్బతీయాలని పెడుతున్న ఖర్చును పాకిస్తాన్ లో హాస్పిటల్స్ కట్టుకోవడానికి, అభివృద్ధిపనులకు ఉపయోగించుకోవాలని ఆ దేశానికి చెప్పారు. శనివారం జాతీయ మీడియా తో మాట్లాడారు. షోయబ్ అక్తర్ భారత్ – పాకిస్తాన్ లు కలిసి కరోనా ను ఎదుర్కొనేందుకు ఫండింగ్ కోసం ట్రై సిరీస్ ఆడాలని అడిగిన విలేఖరి ప్రశ్నకు బదులిస్తూ… పాకిస్తాన్ ఆర్థికంగా ఎదగాలనుకుంటే ముందు భారత్ పై చేసే దాడులను ఆపాలని వాటికి పెట్టే ఖర్చు వాళ్ల దేశంలో హాస్పిటల్స్, అభివృద్ధి పనులకు ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు.
ప్రస్తుతం తన దృష్టి ఆటపై లేదని.. కరోనా వలన విద్యార్థుల చదువులు ఏమైపోతాయోనని బెంగగా ఉందని కపిల్ తెలిపారు. ముందుగా తాను స్కూల్స్ ను రిఓపెన్ చేయాల్సిందిగా కోరుతున్నానని ఆయన చెప్పారు. యువతరం మన దేశ భవిష్యత్తని ఆయన తెలిపారు.