జలుబు, గొంతు నొప్పితో పాటు జీర్ణ సమస్యలకు చెక్​ పెట్టాలంటే...

జలుబు, గొంతు నొప్పితో పాటు జీర్ణ సమస్యలకు చెక్​ పెట్టాలంటే...

ఈ సీజన్​లో జలుబు, గొంతు నొప్పితో పాటు జీర్ణ సమస్యలు కూడా కామన్. మరి వీటికి చెక్​ పెట్టాలంటే... వెచ్చగా ఏదైనా గొంతులోకి పోవాలి. అప్పుడుగానీ, వాటి నుంచి రిలాక్సేషన్​ దొరకదు. అలాంటి రెసిపీల్లో టాప్​గా నిలిచేది సూప్​. మరింకెందుకు ఆలస్యం.. ఇష్టపడే చికెన్​, స్వీట్​ కార్న్​, క్యారెట్​లతో ఘాటుగా, వేడిగా సూప్​ చేసుకుని తాగితే చలికాలాన్ని ఎంజాయ్​ చేయొచ్చు.

క్యారెట్ - కొత్తిమీర

కావాల్సినవి :
క్యారెట్లు – అర కిలో
బిర్యానీ ఆకులు – రెండు 
వెన్న – రెండు టేబుల్ స్పూన్లు
ఉల్లిగడ్డ – ఒకటి, మిరియాలు – కొన్ని, వెల్లుల్లి తరుగు – ఒక టేబుల్ స్పూన్​
కొత్తిమీర – ఒక టేబుల్ స్పూన్
ఉప్పు, నీళ్లు – సరిపడా
మిరియాల పొడి – అర టీస్పూన్

తయారీ :ఒక పాన్​లో వెన్న వేడి చేసి, బిర్యానీ ఆకులు, మిరియాలు, ఉల్లిగడ్డ, వెల్లుల్లి తరుగు వేగించాలి. క్యారెట్ ముక్కలు, కొత్తిమీర వేశాక కాసేపు వేగించాలి. తర్వాత నీళ్లు పోసి, మూతపెట్టాలి. ఉడికాక మెత్తగా రుబ్బాలి. మిరియాల పొడి, కొత్తిమీర చల్లాలి. 

కావాల్సినవి : స్వీట్​కార్న్​ – ముప్పావు కప్పు, నీళ్లు – సరిపడా, నూనె, సోయాసాస్ – ఒకటిన్నర టేబుల్ స్పూన్ చొప్పున, అల్లం, వెల్లుల్లి తరుగు– ఒక్కో టీస్పూన్​, ఉల్లిగడ్డ, క్యారెట్​, క్యాబేజీ, బీన్స్ తరుగు – ఒక్కోటి రెండు టేబుల్ స్పూన్ల చొప్పున, మిరియాల పొడి, చక్కెర – చిటికెడు చొప్పున, వెనిగర్, కార్న్​ ఫ్లోర్ – ఒక్కోటి రెండు టీస్పూన్లు, ఉప్పు – సరిపడా, ఉల్లికాడలు, నిమ్మరసం– కొంచెం
తయారీ : పాన్​లో నీళ్లుపోసి, స్వీట్​కార్న్​ ఉడికించి, వడకట్టాలి. తర్వాత వాటిని మిక్సీ జార్​లో వేసి, చల్లటి నీళ్లు పోసి గ్రైండ్​ చేయాలి. ఆ మిశ్రమాన్ని కూడా వడకట్టాలి. పాన్​లో నూనె వేడి చేసి, అల్లం, వెల్లుల్లి తురుము, ఉల్లిగడ్డ తరుగు వేగించాలి. అందులో క్యారెట్, క్యాబేజీ, బీన్స్ తరుగు వేగించాలి. తర్వాత స్వీట్​కార్న్​ మిశ్రమం కలపాలి.  కాసేపు ఉడికాక, నీళ్లు పోయాలి. సోయాసాస్, మిరియాల పొడి, వెనిగర్, ఉప్పు కలపాలి. కార్న్​ఫ్లోర్​ని నీళ్లలో కలిపి అందులో పోయాలి. ఉల్లికాడల తరుగు, నిమ్మరసం కలపాలి.  

చికెన్

కావాల్సినవి :

చికెన్ – అర కిలో, నూనె – ఒక టేబుల్ స్పూన్
వెల్లుల్లి తరుగు – అర టీస్పూన్, నీళ్లు, ఉప్పు – సరిపడా, పచ్చిమిర్చి – ఒకటి, చక్కెర – అర టీస్పూన్, చికెన్ సూప్ పొడి – ఒక టీస్పూన్ (షాపుల్లో దొరుకుతుంది), 

మిరియాల పొడి – ఒక్కో టీస్పూన్ చొప్పున, వెనిగర్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్ – ఒక్కోటి రెండు టీస్పూన్ల చొప్పున, టొమాటో కెచెప్ – పావుకప్పు, క్యారెట్​ – ఒకటి, క్యాబేజీ తరుగు – ఒక కప్పు, కార్న్​ఫ్లోర్, నిమ్మరసం – ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున

కోడిగుడ్డు – ఒకటి, ఉల్లికాడలు – కొన్ని

తయారీ :

ఒక పాన్​లో నూనె వేడి చేసి, వెల్లుల్లి తరుగు వేసి వేగించాలి. అందులో చికెన్​ వేసి రంగు మారే వరకు వేగించాలి. తర్వాత నీళ్లు పోసి, పచ్చిమిర్చి తురుము, ఉప్పు, చక్కెర, చికెన్ బ్రాత్ పొడి, మిరియాల పొడి, వెనిగర్, సోయా సాస్, టొమాటో కెచెప్, రెడ్ చిల్లీ సాస్ వేసి కలిసి, మూతపెట్టి పావుగంటసేపు ఉడికించాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన క్యారెట్​ ముక్కలు, క్యాబేజీ తురుము వేసి కలపాలి. మూత పెట్టి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. కొన్ని నీళ్లలో కార్న్​ఫ్లోర్​ కలిపి, ఆ నీళ్లను పోయాలి. కోడిగుడ్డు సొన గిలక్కొట్టి వేయాలి. తర్వాత నిమ్మరసం, ఉల్లికాడలు వేసి కలపాలి.