శాఖాహారులు సాధారణంగా నాన్ వెజ్ తినరు...మనుషులే కాదు.. కొన్ని జంతువులు కూడా శాఖాహారాన్నే తింటూ జీవనం కొనసాగిస్తాయి.హైటెక్ యుగంలో కొంతమంది శాఖాహారులు పలు కారణాల వల్ల చాటు మాటుగా నాన్ వెజ్ తీసుకుంటారు.. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా.. అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి..
జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సాధారణంగా జిరాఫీలు శాఖాహారాన్ని మాత్రమే తింటాయి. అవి కూడా ట్రెండ్ మార్చాయో ఏమో తెలియదు కాని.. ఈ వీడియోలో ఓ జిరాఫీ మాత్రం ఎముకలను పరపర నమిలేస్తుంది. ఇటీవల ఒక జింక పాము తిన్న క్లిప్ వైరల్ కాగా... ఇప్పుడు జిరాఫీ ఎముకలను నమిలే వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అయింది. సాధారణంగా జిరాఫీలు చెట్టు పైభాగంలోని ఆకులు, మొగ్గలను తింటాయి. అవి వాటి కోసం మెడను సాగదీసి చెట్ల ఆకులను తింటాయి. కాని ఇప్పుడు ఎముకలను తినే జిరాఫీ వీడియోను IFS అధికారి సుశాంత్ నందా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అంతే కాదు అవి ఎముకలను ఎందుకు తింటాయో కూడా వివరించారు.
భాస్వరం అనే హార్మోన్ జిరాఫీ ఎముకలను తింటుందని IFS అధికారి సుశాంత్ నందా తెలిపారు. ఈ హార్మోన్ లోపిస్తే ఇతర పోషకాల లోపాలకు భిన్నంగా ఉంటుంది. జస్ట్ లైక్ మనుషులకు షుగర్ ( మధుమేహం) వ్యాధి వస్తే శరీరంలోని అవయవాలు అన్ని ఎలా క్రమేణా దెబ్బతింటాయో.. జిరాఫీల్లో కూడా భాస్వరం లోపిప్తే సరిగ్గా అదే జరుగుతుందట. ఈ లోపం ఉంటే జిరాఫీ రంగు పాలిపోతూ క్రమంగా శరీరం పొరల పొరల మాదిరిగా విడిపోతుంటుంది. ఇలాంటి లక్షణాలు వాటికి ముందే తెలుస్తాయని నిపుణులు చెబుతున్నారు. భాస్వరం లోపించినప్పుడు అవి మెడను సాగదీయలేవు. ఇలాంటి లక్షణాలున్న జిరాఫీలు ఎముకలను తింటాయట. IFS అధికారి పోస్ట్ చేసిన వీడియోకు ప్రకృతి అద్భుతం అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో పలువురు నెటిజన్లను ఆకట్టుకోగా, మీ వీడియోలు చాలా సమాచారం అందించేవిలా ఉంటాయని ఓ యూజర్ కామెంట్ చేయగా, గొప్ప వీడియో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నానని మరో యూజర్ రాసుకొచ్చారు.
https://twitter.com/susantananda3/status/1668221353235984385
https://twitter.com/susantananda3/status/1667936291714142208

